Pawan Kalyan: నేనైతే జగన్ లా అసెంబ్లీ నుంచి పారిపోయేవాడిని కాదు: పవన్ కల్యాణ్

గత ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసుంటే బాగుండేదని, ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే టీడీపీకి మద్దతుగా నిలిచానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, తమకు కూడా ఓ పది మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలా అసెంబ్లీ నుంచి పారిపోయేవాడిని కాదని, అసెంబ్లీని స్తంభింపజేసేవాడినని, ప్రజాస్వామ్యంలో మాట్లాడాలని, పోరాడాలని అన్నారు. బంగారం లాంటి అవకాశాన్ని జగన్ దుర్వినియోగం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఉండవల్లి రైతుల సమస్యలపై తాను మాట్లాడటానికి గల కారణాన్ని చెప్పారు. వాళ్లు కూడా తోటి మనుషులేనని, ఆ భావనతోనే వారి సమస్యల గురించి మాట్లాడాను తప్ప, ఓట్ల కోసం కాదని అన్నారు.
Pawan Kalyan
Jagan

More Telugu News