‘ఆంధ్రజ్యోతి' ఎండీ రాధాకృష్ణకు, దర్శకుడు రాజమౌళికి 'గ్రీన్ ఛాలెంజ్’ విసిరిన ఎంపీ కవిత!

  • పచ్చదనం కోసం నా వంతు ప్రయత్నం చేస్తా
  • మహమూద్ అలీతో పాటు పలువురికి ‘గ్రీన్ ఛాలెంజ్’
  • తాను మొక్క నాటుతున్న ఫొటోను పోస్ట్ చేసిన కవిత 
పచ్చదనం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఓ మొక్కనాటి.. ఆపై ఫొటో దిగిన కవిత, దానిని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా నాల్గో విడత హరితహారంను నిన్నటి నుంచి ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే వారికి కవిత ‘గ్రీన్ ఛాలెంజ్’ విసిరారు. 
Go Back to Shorts
kavitha
rajamouli
mahmood ali

More Telugu News