అప్పుడు ముమైత్ ఖాన్ కు జరిగింది.. ఇప్పుడు బాబు గోగినేనికి జరగనుంది!

19-07-2018 Thu 17:23 | Both States
  • బాబు గోగినేనిపై మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదు
  • దేశద్రోహం, మతాలను అవమానించడం తదితర అభియోగాలతో కేసు
  • 25వ తేదీలోగా కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలంటూ కోర్టు ఆదేశం
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటి ముమైత్ ఖాన్ ను... బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పిలిపించి, పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఇదే సీన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హేతువాది బాబు గోగినేనిని బయటకు తీసుకొచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి, ఎలాంటి ఆలస్యం లేకుండా బాబు గోగినేనిని బయటకు తీసుకొచ్చి, విచారించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.

గత నెలలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో బాబు గోగినేనిపై కేసు నమోదైంది. దేశద్రోహం... మతాలు, కులాలు, వర్గాల పేరిట ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, మత విశ్వాసాలను అవమానించడం తదితర తీవ్రమైన అభియోగాలతో పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. కేసు నమోదైనప్పటికీ దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ కేసు పెట్టిన వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.

దీంతో, ఈనెల 25లోగా కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలంటూ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో బిగ్ బాస్ షో నిర్వాహకులకు నోటీసులు అందించి, బాబు గోగినేనిని విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత ఆయన మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు. 
babu goginenicaseMumaith Khanbigboss

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more