రెండో పెళ్లి చేసుకోబోతున్న సింగర్‌ సునీత?

  • 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత
  • వ్యక్తిగత కారణాలతో విడిపోయిన దంపతులు
  • మరో పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం 
తన మధుర గానంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సినీ గాయని సునీతకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే ఆమె రెండో వివాహం చేసుకోబోతోందనేదే ఆ వార్త. అయితే ఆమె పెళ్లాడబోతున్న వరుడు ఎవరనే విషయంపై మాత్రం వెల్లడి కాలేదు.

సినిమా రంగానికి వచ్చిన అనతి కాలంలోనే 19 ఏళ్ల వయసులో కిరణ్ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, వ్యక్తిగత కారణాలతో కొన్నాళ్ల క్రితం భర్త నుంచి ఆమె విడిపోయింది. మళ్లీ ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ విషయంలో నిజానిజాలు తెలియాలంటే ఆమె స్పందించాల్సిందే.

singer
sunitha
tollywood
marriage
second

More Telugu News