'నీట్'గా మాయాజాలం.. సున్నా మార్కులు వచ్చినా డాక్టర్ అయిపోవచ్చు!

17-07-2018 Tue 12:13 | National
  • నీట్ ప్రవేశ పరీక్షలో లేని కటాఫ్ మార్కులు
  • మార్కులతో సంబంధం లేకుండా.. డబ్బుంటే డాక్టర్ అయిపోవచ్చు
  • సంచలన విషయాలను వెల్లడించిన రిపోర్ట్
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్ష డొల్లతనం క్రమంగా బయటకు వస్తోంది. 2017లో నిర్వహించిన నీట్ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీలలో కేవలం సింగిల్ డిజిట్ మార్కులు తెచ్చుకున్న దాదాపు 400 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీటును సాధించారు. ఇంకా దారుణం ఏమిటంటే... సున్నా మార్కులు లేదా నెగెటివ్ మార్కులు తెచ్చుకున్న 110 మంది విద్యార్థులు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో అడ్మిషన్ పొందారు. ఈ నేపథ్యంలో, నీట్ పరీక్ష అర్హతపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.

ఒక రిపోర్ట్ ప్రకారం.. 2017లో ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 530 మంది సింగిల్ డిజిట్ లేదా సున్నా లేదా నెగెటివ్ స్కోరును సాధించారు. ఈ 530 మంది విద్యార్థుల్లో 507 మంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో చేరారు. నీట్ ఎగ్జామ్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో కటాఫ్ మార్కులు లేకపోవడం గమనార్హం. ప్రతి పేపర్ లో కనీసం ఇన్ని మార్కులు సాధించాలనే షరతులు ఈ ప్రవేశ పరీక్షలో లేవు. ఈ నేపథ్యంలో, ఏడాదికి రూ. 17 లక్షల ఫీజు చెల్లించగల స్తోమత ఉన్నవారంతా... మార్కులతో సంబంధం లేకుండా ఎంబీబీఎస్ లో జాయిన్ అయిపోతున్నారు.

వాస్తవానికి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ప్రతి సబ్జెక్ట్ లో 50 శాతానికి మించి (రిజర్వ్ డ్ కేటగిరీలకు 40 శాతం) మార్కులు వస్తేనే మెడిసిన్ లేదా డెంటల్ కాలేజీలలో ప్రవేశానికి అర్హత ఉంటుంది. 2012లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త ఉత్తర్వులను జారీ చేస్తూ, నీట్ ఎగ్జామ్ లో అర్హత మార్కును 50 శాతం, 40 శాతం నుంచి 50వ, 40వ శతాంశాలుగా (పర్సెంటైల్) మార్చుతున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే సున్నా మార్కులు వచ్చిన శ్రీమంతులు డాక్టర్ పట్టా పుచ్చుకునే అవకాశం ఏర్పడింది. దీనిపై, సర్వత్ర ఆశ్చర్యంతో పాటు ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
neetmarksadmissionszero marks

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more