రాహుల్ గాంధీ తల్లి విదేశీ.. ఆయనెలా ప్రధాని అవుతారు?: విరుచుకుపడిన బీఎస్పీ
- మోదీని ఎదురొడ్డగలిగేది మాయావతి మాత్రమే
- తర్వాతి ప్రధాని ఆమెనే
- రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేరు
పార్టీ చీఫ్ మాయావతి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోగలిగే సత్తా ఆమెకు మాత్రమే ఉందన్నారు. కుమారస్వామిని కర్ణాటక ముఖ్యమంత్రిగా చేయడంలో మాయావతి కీలక పాత్ర పోషించారని అన్నారు. దీంతో ఆమె దేశంలో శక్తిమంతమైన నేతగా ఎదిగారన్నారు. ఆమె దబాంగ్ (భయం లేని వ్యక్తి) అని, నరేంద్రమోదీ, అమిత్ షాలను ఎదుర్కోగలిగే శక్తి ఆమెకు మాత్రమే ఉందని తేల్చి చెప్పారు.
రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ.. రాహుల్.. తండ్రి రాజీవ్ గాంధీలా కంటే తల్లి సోనియాలానే కనిపిస్తారని అన్నారు. ఆమె తల్లి ఓ విదేశీయురాలని, ఆయన ఎప్పటికీ ప్రధాని కాలేరని పేర్కొన్నారు.