ఖాళీగా ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు... ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత!

  • ప్రకాశం బ్యారేజ్ కు పోటెత్తిన వరద
  • నల్గొండ, గుంటూరు వర్షాలతోనే
  • మూడు గేట్లు ఎత్తివేత
ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి జీవధారైన కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు చుక్క వరదనీరు రాని పరిస్థితుల్లో దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్ కి మాత్రం వరద పోటెత్తింది. ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాల్లో కురుస్తున్న వర్షపు నీరు కృష్ణానదిలోకి వస్తుండటంతో అధికారులు ఈ ఉదయం ప్రకాశం బ్యారేజ్ మూడు గేట్లను ఎత్తివేశారు. బ్యారేజ్ కి 14 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని, కుడి, ఎడమ కాలువల ద్వారా 10 వేల క్యూసెక్కుల నీటిని, దిగువకు 4 వేల క్యూసెక్కల నీటిని వదులుతున్నామని, వరద ఇంకాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Prakasam Barrage
Krishna River
Flood

More Telugu News