ఈ సారి సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తా!: టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్
- లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధం
- అది నా నిర్ణయం మాత్రమే
- పార్టీ నిర్ణయానికి విధేయుడినై ఉంటా
తన నిర్ణయాన్ని ఇప్పటికే అధిష్ఠానానికి తెలియజేశానని చెప్పిన అజర్.. తాను కెప్టెన్ను కాదన్నారు. తానే కనుక ఇక్కడ కెప్టెన్ను అయి ఉంటే మాత్రం సికింద్రాబాద్నే ఎంచుకునే వాడినన్నారు. ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. అయితే, పాతబస్తీ నుంచి మాత్రం పోటీ చేసే యోచన లేదని అజర్ తేల్చి చెప్పారు.