అధికారుల అలసత్వం వల్లే బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగింది: ఏపీ బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్

13-07-2018 Fri 16:18 | Andhra
  • ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరిగింది
  • బీసీ విద్యార్థులు, బీసీ సంఘాల వాదనలో న్యాయం ఉంది
  • ఆధారాలు సమర్పించి స్టే రద్దు చేయిస్తాం
  • మెడికల్ సీట్ల భర్తీ రీ కౌన్సిలింగ్ నిర్వహిస్తాం
అధికారుల అలసత్వం వల్ల ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో రిజర్వేషన్ వర్గాలకు.. ముఖ్యంగా బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ చైర్మన్ గుండుమల తిప్పేస్వామి మండిపడ్డారు. అమరావతిలోని వెలగపూడి శాసనసభ భవనం మొదటి అంతస్తులోని కమిటీ హాలులో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు మెడికల్ కౌన్సిలింగ్ లో జరుగుతున్న అన్యాయంపై నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోందని, బీసీ విద్యార్థులు, బీసీ సంఘాల వాదనలో న్యాయం ఉందని అన్నారు. ఈరోజు ఉదయం జరిగిన కమిటీ సమావేశంలో ఈ అంశంపై ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సి.వెంకటేశ్వర రావు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ వి.రామారావు, ఇతర ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. 2001లో సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా రూపొందించిన 550 జీఓ ప్రకారం పదహారేళ్లుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మెడికల్ కౌన్సిలింగ్ లో సీట్లు భర్తీ చేశారని చెప్పారు.

2017 ఆగస్టు 30న కోర్టు స్టే ఇవ్వడం వల్ల ఈ సమస్య తలెత్తిందని, ఈ స్టేను ఎత్తివేయడానికి కావాల్సిన మద్దతు డాక్యుమెంట్లు, ఆధారాలు ఉన్నత విద్యాశాఖ వద్ద ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పించి ఆ స్టే ఎత్తివేయిస్తామని చెప్పారు. రిజర్వేషన్ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన కౌన్సిలింగ్ ఆపివేయమని ఆదేశించారని, కొందరు అధికారులు బాధ్యతగా వ్యవహరించకపోవడంతో స్టే ఎత్తివేయించడంలో ఇంత జాప్యం జరిగిందని చెప్పారు. స్టే ఎత్తివేసిన తరువాత రీ కౌన్సిలింగ్ జరిపి రిజర్వేషన్ వర్గాలకు న్యాయం చేస్తామని, జాప్యానికి కారకులైన వారిపై వచ్చే కమిటీ సమావేశంలో చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరుగకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు జరిగే విధంగా చూస్తామని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అన్యాయం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని గుండుమల తిప్పేస్వామి అన్నారు. ఇటీవల కమిటీ విజయనగరం జిల్లాలో పర్యటించిందని, అక్కడ అన్ని అంశాలను పరిశీలించామని, రిజర్వేషన్లను ఎవరు ఇష్టం వచ్చినట్లు వారికి అనుకూలంగా మలచుకోవడానికి వీలులేదని హెచ్చరించారు.  

స్టే ఎత్తివేతకు తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించాం


మెడికల్ కౌన్సిలింగ్ లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి స్టే ని ఎత్తివేయమని కోరుతూ తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బీసీ సంక్షేమ కమిటీ సమావేశంలో రిజర్వేషన్ అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.550 రూపొందించిందని, ఈ జీఓ ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో ఒక కళాశాలలో చేరి, తరువాత రిజర్వేషన్ కేటగిరీలో మరో కళాశాల లేదా కోర్సులోకి మారితే ఏర్పడిన ఖాళీని అదే రిజర్వు కేటగిరి అభ్యర్థితో మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని అన్నారు. 2001 నుంచి ఈ ప్రకారమే ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేస్తున్నారని, 2017లో తన కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయించారని కొందరు హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ప్రస్తావించారు.

ఇరు వర్గాల వాదన విన్న హైకోర్టు 2017 ఆగస్ట్ 30న ఆ రకమైన సీట్ల కేటాయింపు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, ఈ ఉత్తర్వులు వెలువడే నాటికి సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి అయిందని అన్నారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది సీట్లను భర్తీ చేస్తుండటంతో రిజర్వేషన్ వర్గాలు ఆందోళనకు దిగాయని, మధ్యంతర ఉత్తర్వులను తొలగించి, కేసును కొట్టివేయాల్సిందిగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం హైకోర్టును కోరినట్లు, కేసు విచారణలో ఉన్నట్లు, సోమవారం విచారణ జరుగుతుందని  ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఎన్టీఆర్ వైద్య విశ్యవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సీ.వెంకటేశ్వర రావులు కమిటీకి వివరించారు.

ఈ విషయమై కమిటీ చైర్మన్ తిప్పేస్వామి మాట్లాడుతూ, స్టే ఎత్తివేయించడానికి ఇంత కాలం ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు. అధికారులు తగిన బాధ్యతతో వ్యవహరించకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరగడానికి వీలులేదని, వారికి న్యాయం జరగాలని, అందుకు తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించి స్టే ఎత్తివేయించడానికి తీవ్రంగా ప్రయత్నించాలని ఆదేశించారు. ఈ విషయంలో రిజర్వేషన్ వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని ఉన్నతాధికారులను, వైస్ ఛాన్సలర్ ని తిప్పేస్వామి కోరారు. 
ap bc committeegundumala

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more