వామపక్షాలు, పోలీసుల తోపులాటలో ముక్కలైన జేసీ దిష్టిబొమ్మ!
- కమ్యూనిస్టులను దొంగలు అన్న జేసీ
- ధర్నా, రాస్తారోకో నిర్వహించిన వామపక్షాలు
- జేసీకి ప్రజలు బుద్ధి చెబుతారన్న కమ్యూనిస్టు నేతలు
దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ధర్నా చేపట్టారు. రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కమ్యూనిస్టు శ్రేణులు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వామపక్షాలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దిష్టిబొమ్మను ఎలాగైనా దగ్ధం చేయాలని కమ్యూనిస్టులు, వారి నుంచి లాక్కోవాలని పోలీసులు చేసిన ప్రయత్నంలో దిష్టిబొమ్మ తునాతునకలైంది.