సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • లండన్ వెళుతున్న పూజా హెగ్డే 
  • 'క్వీన్' కోసం పారిస్ లో కాజల్, తమన్నా
  • నాగ చైతన్యతో రాహుల్ రవీంద్రన్ సినిమా
 *  తెలుగులో తాజాగా 'సాక్ష్యం' చిత్రాన్ని పూర్తి చేసి, మరోపక్క మహేశ్ బాబుతో ఓ చిత్రాన్ని చేస్తున్న అందాలతార పూజా హెగ్డే త్వరలో హిందీ చిత్రం షూటింగులో పాల్గొంటుంది. అక్షయ్ కుమార్ హీరోగా సాజిద్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హౌస్ ఫుల్ 4' చిత్రంలో పూజ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం త్వరలో లండన్ వెళ్లనుంది.
*  హిందీలో విజయం సాధించిన 'క్వీన్' చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పారిస్ లో జరుగుతోంది. ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ అక్కడ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ 'దటీజ్ మహాలక్ష్మి' కోసం తమన్నా, తమిళ వెర్షన్ షూటింగ్ కోసం కాజల్  ప్రస్తుతం పారిస్ లో ఉన్నారు.
*  యువ నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి, సుశాంత్ హీరోగా 'చి.ల.సౌ' పేరిట ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇది సెట్స్ పై ఉండగానే, తన తదుపరి చిత్రాన్ని కూడా రాహుల్ ప్రకటించాడు. అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించే తదుపరి చిత్రానికి కూడా తాను దర్శకత్వం వహించనున్నట్టు పేర్కొన్నాడు. ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తాడని సమాచారం.  
Pooja Hegde
Kajal Agarwal
Thamanna

More Telugu News