పంజాబ్ యువకుడిపై సొంత కారును దొంగిలించిన కేసు...!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పంజాబ్ యువకుడిపై సొంత కారును దొంగిలించిన కేసు...!

  • చండీగఢ్ లో ఘటన
  • నో పార్కింగ్ జోన్ లోని కారుకు క్లాంపులు వేసిన పోలీసులు
  • వాటిని పగులగొట్టి కారును ఎత్తుకెళ్లిన వ్యక్తి
ట్రాఫిక్ పోలీసులకు మస్కా కొట్టిన ఓ పంజాబ్ యువకుడిపై, తన కారును తానే దొంగిలించిన కేసును రిజిస్టర్ చేశారు పోలీసులు. సొంత కారు యజమానిపైనే చోరీ కేసు నమోదైన ఈ ఆసక్తికర ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, చండీగఢ్ లో ఫిరోజ్ పూర్ కు చెందిన ఓ వ్యక్తి సెక్టార్ 22కు వచ్చి నో పార్కింగ్ జోన్ లో తన కారును పార్క్ చేశాడు.

 ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బంది, ఆ కారుతో పాటు ఆ ప్రాంతంలో అక్రమంగా పార్క్ చేసిన కారుల టైర్లకు క్లాంపులు వేసుకుంటూ వెళ్లారు. కాసేపటి తరువాత చలాన్ స్టిక్కర్లు అతికిస్తూ వస్తుండగా, ఓ కారు కనిపించలేదు. తాము వేసిన క్లాంప్స్ విరిగి రోడ్డుపై పడివుండటంతో ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొంత కారు దొంగతనం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ఆభియోగాలు నమోదు చేస్తూ, ఐపీసీలోని సెక్షన్ 379, 427 కింద కేసు పెట్టిన పోలీసులు, కారు యజమానిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.
Punjab
Chandighad
Police
Car
Clamps

More Telugu News