ఎన్టీఆర్ బయోపిక్ కోసం బెంగాలీ నటుడు!
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ బయోపిక్ కోసం బెంగాలీ నటుడు!

  • ఎన్టీఆర్ తొలి సినిమాగా 'మనదేశం'
  • ఇక్కడి నుంచే ఎన్టీఆర్ నట ప్రస్థానం 
  • ఎన్టీఆర్ ను పరిచయం చేసిన ఎల్వీ ప్రసాద్      
'ఎన్టీఆర్' బయోపిక్ కి సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రక్రియ చురుకుగా జరుగుతోంది. విశిష్టమైన ఈ ప్రాజెక్టులో ఒక్కొక్కరూ జాయిన్ అవుతున్న కొద్దీ అందరిలో ఆసక్తి పెరుగుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం బెంగాలీ నటుడు 'జిషూ సేన్' ను తీసుకున్నారు. ఎన్టీఆర్ ను 'మనదేశం' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం చేసింది ఎల్వీ ప్రసాద్. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడు.ఈ సినిమా నుంచే నటుడిగా ఎన్టీఆర్ ప్రయాణం మొదలైంది. ఇక నటుడిగా .. దర్శక నిర్మాతగాను ఆణిముత్యాల్లాంటి ఎన్నో అపురూప చిత్రాలను అందించి ఎల్వీ ప్రసాద్ ఎంతో  ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అందువలన ఎన్టీఆర్ జీవితచరిత్రలోఎల్వీ ప్రసాద్ పేజీ ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ పాత్రకి గాను క్రిష్ 'జిషూ సేన్' ఎంపిక చేసుకున్నారు. ఇంతకుముందు ఈయన క్రిష్ దర్శకత్వం వహించిన 'మణికర్ణిక'లో 'గంగాధరరావు' పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.      
ntr
lv prasad

More Telugu News