రాత్రంతా పోలీసు విచారణను ఎదుర్కొన్న కత్తి మహేష్!

  • గత రాత్రి కత్తి మహేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • సీఆర్పీసీ 41 (ఏ)కింద నోటీసులు
  • నేడు కోర్టు ముందుకు కత్తి
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో గత రాత్రి సినీ విమర్శకుడు కత్తి మహేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆయన్ను రాత్రంతా విచారించారు. హైదరాబాద్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12లోని ఆనంద్ బంజారా కాలనీ, ప్లాట్ నంబర్ 29లో కత్తి మహేష్ నివాసం ఉంటుండగా, ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు, నోటీసులు ఇచ్చి, అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పి, తమవెంట తీసుకెళ్లారు.

ఈ నోటీసును సీఆర్పీసీ 41 (ఏ) కింద జారీ చేసిన పోలీసులు, ఆయనపై గత నెల 30న కేసు నంబర్ ఎఫ్ఐఆర్ / సీఆర్ నంబర్. 002/2018ను రిజిస్టర్ చేశారు. ఐపీసీలోని 205 (ఏ), 505 (2) కింద అభియోగాలను నమోదు చేసినట్టు తెలిపారు. ఇక గత రాత్రి స్టేషన్ లో ఉంచిన ఆయన్ను, దేవుడి గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? ఎందుకు చేశారు? గతంలో ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడైనా చేశారా? వంటి ప్రశ్నలు సంధించి, కత్తి చెప్పిన సమాధానాలను సరిపోల్చుకున్నట్టు సమాచారం. నేడు ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
Go Back to Shorts
Hyderabad
Police
Kathi Mahesh
Arrest

More Telugu News