దానం నాగేందర్ వ్యాఖ్యలను ఖండించిన ముఖేష్ గౌడ్
- బీసీలు, దళితులు, మైనార్టీలు చేయి కలిపితే తిరుగుండదు
- కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం కనుకనే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా
- కాంగ్రెస్ నేతల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్న మాట నిజమే
తెలంగాణ కొత్త రాష్ట్రమని, కొత్త ప్రభుత్వం ఏర్పడిందని, అందుకే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నానని చెప్పారు. గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమేనని... పార్టీలో ఇలాంటివన్నీ సహజమేనని చెప్పారు. పార్టీ మారే అంశంపై అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.