రూ.15,000కే 4కే టీవీ.. అమెజాన్ లో ప్రత్యేక అమ్మకాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ.15,000కే 4కే టీవీ.. అమెజాన్ లో ప్రత్యేక అమ్మకాలు!

  • క్లౌడ్ టీవీ ఎక్స్2 పేరుతో క్లౌడ్ వాకర్ కంపెనీ విడుదల
  • అమేజాన్ లోనే ప్రత్యేకంగా విక్రయాలు
  • 32 అంగుళాలు, 55 అంగుళాల సైజులో లభ్యం
4కే టీవీ కావాలంటే ప్రస్తుతం మార్కెట్లో రూ.30,000పైనే వెచ్చించాల్సిన పరిస్థితి ఉండగా... ఓ స్టార్టప్ కంపెనీ ‘క్లౌడ్ వాకర్’ కేవలం రూ.14,990 ధరకే 4కే రెడీ ఫుల్ హెచ్ డీ టీవీని విడుదల చేసింది. ఈ టీవీ మోడల్ పేరు క్లౌడ్ టీవీ ఎక్స్2. దేశంలో తొలి ఫుల్ హెచ్ డీ టీవీ, 4కే రెడీతో కూడినది ఇదేనని కంపెనీ స్వయంగా ప్రకటించింది.

ఇందులో ఆండ్రాయిడ్ నౌగత్ 7.0 ఓఎస్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజీ ఉన్నాయి. 32 అంగుళాల టీవీ ధర రూ.14,990. 55 అంగుళాల సైజు మోడల్ కూడా ఉంది. ఈ టీవీతో వచ్చే రిమోట్ ను వైర్ లెస్ మౌస్ గా వినియోగించుకోవచ్చు. అమేజాన్ లోనే ప్రత్యేకంగా ఇవి అమ్ముడవుతాయి. క్లౌడ్ వాకర్ కంపెనీ ఇప్పటికే కర్వ్ డ్ 4కే టీవీ, ఫ్లాట్ 4కే టీవీ, ఫుల్ హెచ్ డీ టీవీలను విక్రయిస్తోంది.  

clowdwalker 4k ready tv

More Telugu News