దివ్యాంగుడైన ఐదేళ్ల బిడ్డను భారత మహిళ నుంచి దూరం చేసిన అమెరికా అధికారులు!
- మెక్సికో నుంచి అమెరికాలోకి ప్రవేశించిన భావన్ పటేల్
- అరెస్ట్ చేసి బిడ్డను వేరు చేసిన అధికారులు
- 'ది వాషింగ్టన్ పోస్ట్' కథనం
ఆమెకు ఐదేళ్ల బిడ్డ ఉండగా, అతను దివ్యాంగుడు. ఆ బిడ్డను బలవంతంగా స్వాధీనం చేసుకుని బాలల శిబిరానికి తరలించారు. అమెరికాలో 'జీరో టాల్ రెన్స్' పాలసీ అమలులోకి వచ్చిన తరువాత, ఓ భారత మహిళ నుంచి బిడ్డ వేరు పడటం ఇదే తొలిసారి. దాదాపు 2 వేల మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల నుంచి అధికారులు దూరం చేశారు.
కాగా, ఆరిజోనా కోర్టులో 30 వేల డాలర్ల బాండ్ ను భావన్ పటేల్ చెల్లించి బయటకు వచ్చినట్టు తెలుస్తుండగా, తన బిడ్డను ఆమె కలిశారో లేదో తెలియరాలేదు. ఈ వారం ప్రారంభంలో వలసదారుల నుంచి పిల్లలను వేరు చేయాలన్న తన కఠిన నిర్ణయాన్ని ట్రంప్ వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. పటేల్ అరెస్ట్ ఎప్పుడు జరిగిందన్న విషయమై పత్రిక ఎటువంటి సమాచారాన్నీ ప్రచురించలేదు.