ఆ నిర్మాత గురించి తెలిసి కూడా గెస్ట్ హౌస్ కు ఆమె ఎందుకు వెళ్లింది?: పృథ్వి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ నిర్మాత గురించి తెలిసి కూడా గెస్ట్ హౌస్ కు ఆమె ఎందుకు వెళ్లింది?: పృథ్వి

  • హీరోయిన్ పాత్రకు సరిపోయే వారికే నిర్మాతలు అవకాశం ఇస్తారు
  • కొంత మంది వల్ల సినీ పరిశ్రమ పరువుపోతోంది
  • సినిమా వాళ్లకు అద్దెకు ఇల్లు కూడా దొరకడం లేదు
తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని కమెడియన్ పృథ్వి తెలిపాడు. కొంత మంది వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. తన సినిమాలో హీరోయిన్ పాత్రకు సరిపోయే అమ్మాయి కోసమే నిర్మాత వెతుకుతాడని... ఎవరికి పడితే వారికి హీరోయిన్ పాత్రను ఇవ్వలేడని చెప్పారు. 'మల్లీశ్వరి' సినిమాలో హీరోయిన్ పాత్రకు కత్రినా కైఫ్ లాంటి అమ్మాయి అయితేనే సరిపోతుందని... ఇక్కడున్నవాళ్లతో ఆ పాత్రను చేయించలేమని తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు హీరోయిన్లే ఉన్నారని... ఆమని, దివ్యవాణి వరకు ఆ ట్రెండ్ నడిచిందని చెప్పారు. టాప్ హీరోల పక్కన సరిపోయే తెలుగు అమ్మాయిలను చూపించండంటూ ఎదురు ప్రశ్నించారు.

సినీపరిశ్రమ పరువు పోయేలా కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రవర్తిస్తున్నారని పృథ్వి ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో పని చేసే మహిళలకు అద్దెకు ఇల్లు కూడా దొరకని పరిస్థితి ఉందని అన్నారు. ఓ సినీ నిర్మాత గురించి ఒక ఆవిడ తీవ్ర ఆరోపణలు చేసిందని... మరి ఆయన గురించి తెలిసి కూడా గెస్ట్ హౌస్ కు ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. వాస్తవానికి నటీమణుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు ఇండస్ట్రీలో లేరని, కొందరు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఇండస్ట్రీ అంటేనే జనాల్లో చులకన భావం ఏర్పడిందని అన్నారు.  
pruthvi
tollywood
Casting Couch

More Telugu News