అర్ధనగ్నంగా రోడ్లపై పరుగులు పెట్టించి వీడియో తీశారు... పబ్ లో బ్లేడ్ దాడికి గురైన సమీర!

  • ఫిరోజ్, కీర్తి రెడ్డి దారుణంగా హింసించారు
  • జీవీకే మాల్ లో బట్టలు చిరిగేలా కొట్టారు
  • తాను పరుగులు తీస్తుంటే వీడియో తీసి వైరల్ చేశారని ఆరోపణ
తనను ఫిరోజ్, కీర్తి రెడ్డిలు కలిసి దారుణంగా హింసించారని, తన డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా, హత్య చేస్తామని బెదిరించారని, రెండు రోజుల క్రితం పబ్ లో బ్లేడ్ దాడికి గురైన సమీర మీడియా ముందు వాపోయింది. తనతో వ్యభిచారం చేయించాలని వారిద్దరూ కలసి ప్రయత్నించారని, తాను అంగీకరించకపోవడంతోనే ఈ పని చేశారని చెబుతూ చేతులకు అయిన గాయాలను చూపించింది.

తనను కారులో ఎక్కించుకుని బలవంతంగా మద్యం తాగించి కీర్తి ఇంటికి తీసుకెళ్లిన ఫిరోజ్, తనను కొట్టాడని ఆరోపించింది. పోలీసులకు ఫిరోజ్ గురించి ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదని చెప్పిన సమీర, తనను బంజారాహిల్స్ లోని జీవీకే మాల్ లో కొడుతుంటే, చుట్టూ ఉన్నవారు ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. తన బట్టలు చింపేశారని, మాల్ ముందు తాను సెమీ న్యూడ్ గా పరుగులు తీస్తుంటే వీడియో తీసి, వాటిని వైరల్ చేశారని వాపోయింది. పోలీసులు నిందితుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.

కాగా, సమీర కేసు విషయమై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు, బ్లేడ్ దాడి ఘటనపై కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
Go Back to Shorts
Hyderabad
Police
Pub
Blade
Sameera

More Telugu News