వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు
- టీడీపీకి గుడ్ బై చెబుతున్న యర్రా నవీన్
- కాపు కార్పొరేష్ డైరెక్టర్ గా పని చేసిన నవీన్
- ఛైర్మన్ పదవి లభించకపోవడంతో అసంతృప్తి
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా నారాయణస్వామి పని చేశారు. ఆయన కుమారుడు నవీన్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా బాధ్యతలను నిర్వహించారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగినప్పటికీ... ఫలితం దక్కలేదు. తన కుమారుడికి ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలని యర్రా పట్టుబట్టినా... చివరకు ఆ పదవిని కొత్తపల్లి సుబ్బరాయుడికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసంతృప్తికి గురైన నవీన్... పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు.