మా ఇంటి వేడుకకు తప్పకుండా రావాలండీ... సీఎం కేసీఆర్ కు ఆహ్వానాల వెల్లువ!

తెలంగాణ సీఎం కేసీఆర్ కు పలువురు ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందాయి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ తన కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరుకావాలని కోరుతూ ఆహ్వానపత్రికను అందజేశారు.అదే విధంగా, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తన కుమారుడి వివాహానికి తప్పకుండా రావాలని కేసీఆర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెళ్లి పత్రికను ఆయనకు అందజేశారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి తన మనవడి వివాహానికి రావాలని కేసీఆర్ ను ఆహ్వానించారు.
మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా కోరుతూ కేసీఆర్ దంపతులను కలిసి పెళ్లి పత్రికను అందించారు. గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ సర్దార్ పుటం పురుషోత్తం రావు తన కూతురి వివాహానికి కేసీఆర్ ను ఆహ్వానిస్తూ శుభలేఖను ఇచ్చారు.


More Telugu News