ఎన్టీఆర్ కాల్ చేసి అభినందించడం ఎప్పటికీ మరిచిపోలేను: పరుచూరి గోపాలకృష్ణ
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ కాల్ చేసి అభినందించడం ఎప్పటికీ మరిచిపోలేను: పరుచూరి గోపాలకృష్ణ

  • 'అనురాగదేవత'కి డైలాగ్స్ రాశాము
  • ఎన్టీఆర్ తో మా మొదటి సినిమా అది 
  • ఆయనే 'పరుచూరి బ్రదర్స్' అని పేరు పెట్టారు  


తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమం ద్వారా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, దర్శకులు తాతినేని రామారావు గురించి ప్రస్తావించారు. "కథ విషయంలో తాతినేని రామారావుగారు చాలా లోతుగా ఆలోచించేవారు. ఆయన నుంచి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. అవి మా కెరియర్ కి ఎంతగానో ఉపయోగపడ్డాయి. తొలిసారిగా ఆయనతో చేసిన 'అనురాగదేవత' మా కెరియర్ కి గట్టి పునాదులు వేసింది.

ఈ సినిమాకి మేము సంభాషణలను సమకూర్చాము. 'పరుచూరి బ్రదర్స్' అనే టైటిల్ కార్డు పడటం ఈ సినిమాతోనే మొదలైంది. ఈ సినిమా విడుదల సమయంలో నేను 'ఉయ్యూరు'లో వున్నాను. రిలీజ్ రోజునే ఎన్టీఆర్ గారు నాకు కాల్ చేశారు. 'బ్రదర్ ఎన్టీఆర్ కి ఎంత పేరొస్తోందో .. డైలాగ్ రైటర్స్ గా మీకూ అంతే పేరొస్తోంది' అంటూ అభినందించారు. 'పరుచూరి బ్రదర్స్' అనే పేరు పెట్టి మీరు ఆశీర్వదించారు .. ఈ సినిమా గొప్పగా ఆడుతోంది .. మీరు మెచ్చుకున్నారు .. చాలా సంతోషం' అన్నాను. ఆయనలా అభినందించడం మేము ఎప్పటికీ మరచిపోలేము. 
ntr
paruchuri

More Telugu News