ముద్దు పెట్టబోతే చాకచక్యంగా తప్పించుకున్న మహిళా రిపోర్టర్... వైరల్ అవుతున్న వీడియో!
- రష్యా ఫుట్ బాల్ పోటీలను కవర్ చేసేందుకు వెళ్లిన బ్రెజిల్ జర్నలిస్ట్
- ముద్దు పెట్టబోయిన ఆకతాయి
- తప్పించుకుని చివాట్లు పెట్టిన మహిళా రిపోర్టర్
బ్రెజిల్ కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ జూలియా గుమారాస్ అనే మహిళా జర్నలిస్ట్ యోకాటెరిన్ బర్గ్ నుంచి రిపోర్టును ఇస్తున్న సమయంలో ఓ ఆకతాయి ఆమెను సమీపించి ముద్దు పెట్టబోయాడు. అతన్నుంచి తప్పించుకున్న జూలియా, ఇది మంచి పద్ధతి కాదని చివాట్లు పెట్టింది. ఓ అమ్మాయి పట్ల ఇలా చేయడం తగదని, ఇంకోసారి ఇలా చేయవద్దని మండిపడింది. జరిగిన ఘటనపై ట్విట్టర్ లో స్పందిస్తూ, ఇక్కడిలా జరగడం రెండోసారని, దాని గురించి చెప్పడానికి మాటలు రావడం లేదని వ్యాఖ్యానించింది. తన అదృష్టం బాగుండి తప్పించుకున్నానని వ్యాఖ్యానించింది. రష్యాలో ఇటువంటి పరిస్థితులు చాలానే ఎదురవుతున్నాయని పేర్కొంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.