దానం నాగేందర్ అనుచరులకు జరిమానా విధించిన జీహెచ్ఎంసీ!
- కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన దానం
- ఆ సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసిన దానం అనుచరులు
- రూ. 30 వేలు జరిమానా విధించిన జీహెచ్ఎంసీ
ఈ నేపథ్యంలో, దానం అనుచరులు నాగేంద్ర, మోహన్ రెడ్డిలు నిబంధనలకు విరుద్ధంగా బ్యానర్లను ఏర్పాటు చేశారంటూ ఒక్కొక్కరికి రూ. 15 వేలు చొప్పున మొత్తం రూ. 30 వేల జరిమానాను జీహెచ్ఎంసీ విధించింది. గతంలో కూడా కేటీఆర్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేసిన వారిపై జీహెచ్ఎంసీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.