ఇంట్లోకి వెళ్తున్న బాలుడిని నోట కరుచుకుని వెళ్లిన చిరుత!

  • ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘటన
  • మనుషుల రక్తం రుచిమరిగిన చిరుత
  • ఇప్పటి వరకు ముగ్గురు చిన్నారులను పొట్టనపెట్టుకున్న వైనం
ఓ బాలుడిని తల్లిదండ్రుల కళ్ల ఎదుటే చిరుతపులి నోట కరుచుకుని వెళ్లిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. పితోర్ ఘడ్ జిల్లా పోఖ్రీ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కార్తీక్ అనే ఐదేళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలసి ఢిల్లీలో జరిగిన ఓ వివాహానికి వెళ్లాడు. నిన్న రాత్రి వీరు స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఇంటి వద్ద కారు ఆగగానే... ఆ చిన్నారి హుషారుగా ఇంట్లోకి పరుగుపెట్టాడు. అయితే, ఇంటి  సమీపంలోని పొదల్లో మాటువేసిన ఓ చిరుత... ఆ బాలుడిని నోట  కరుచుకుని రెప్పపాటు కాలంలోనే అడవిలోకి పారిపోయింది.

 అనంతరం అతని తల్లిదండ్రులు, బంధువులతో పాటు గ్రామస్తులు అడవిలో గాలించగా... చిన్నారి మృతదేహం కనిపించింది. బాగేశ్వర్ జిల్లాలో ఇటీవలే ఓ ఏడేళ్ల బాలుడిని, మార్చి నెలలో నాలుగేళ్ల మరో బాలుడిని కూడా చిరుత పొట్టనపెట్టుకుంది. దీంతో, మనుషుల రక్తం తాగేందుకు అలవాటు పడ్డ చిరుతను చంపేయాలంటూ అటవీ గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Go Back to Shorts
cheetah
boy
Uttarakhand

More Telugu News