వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్ సుమిత్రా మహాజన్
- ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాజీనామా
- ఏప్రిల్-6న రాజీనామా లేఖలు సమర్పించిన వైసీపీ ఎంపీలు
- ఇటీవల రాజీనామాలు ఆమోదించాలని ఢిల్లీకి వెళ్లొచ్చిన నేతలు
ఇటీవల స్పీకర్ పిలుపుపై ఢిల్లీకి వెళ్లిన వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదించాలని కోరిన విషయం తెలిసిందే. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని, నిర్ణయం మారకపోతే రాజీనామాలు ఆమోదిస్తానని ఆమె అప్పట్లో అన్నారు. అయినప్పటికీ ఎంపీలు తమ రాజీనామాల ఆమోదానికి పట్టుబట్టడంతో స్పీకర్ ఈరోజు వాటిని ఆమోదించారు.