ఇండోనేషియాలో పడవ ప్రమాదం.. 200 మంది గల్లంతు!

  • ఇండోనేషియా చరిత్రలోనే ఘోర ప్రమాదం
  • పడవ సామర్థ్యం 43 మంది
  • ఎక్కించుకున్నది 200 మందికి పైగా
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
ఇండోనేషియాలో పెను ప్రమాదం సంభవించింది. సుమత్రా దీవిలోని పర్యాటక కేంద్రమైన తోబా సరస్సులో సోమవారం ఓ పడవ మునిగిన ఘటనలో 200 మంది గల్లంతయ్యారు. తొలుత 60 మంది మృతి చెందినట్టు భావించామని, అయితే, బుధవారం నాటికి గల్లంతైన వారి సంఖ్య 200కు చేరుకుందని అధికారులు పేర్కొన్నారు.

అయితే పడవలో ఎంతమంది ప్రయాణికులున్నారన్న విషయంలో స్పష్టత లేదన్నారు. దాని సామర్థ్యం కేవలం 43 మందేనని తెలిపారు. టికెట్లు తీసుకోకుండా ఎక్కువ మందిని ఎక్కించుకున్నట్టు తెలుస్తోందన్నారు. ప్రయాణికులతోపాటు పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు కూడా పడవలో ఉన్నట్టు ఇండోనేషియా విపత్తు సంస్థ తెలిపింది. గలంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇండోనేషియా చరిత్రలోనే ఇది అత్యంత  ఘోరమైన పడవ ప్రమాదమని అధికారులు చెబుతున్నారు.
Go Back to Shorts
Indonasia
ship
Drown
tourist

More Telugu News