ఏపీ అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు భారీగా వేతనాలు పెంచిన సీఎం చంద్రబాబు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు భారీగా వేతనాలు పెంచిన సీఎం చంద్రబాబు!

  • అంగన్ వాడీ టీచర్ల, ఆయాల వేతనాలు పెంచుతున్నాం
  • అన్ని వర్గాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • ఈ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.305 కోట్లకు పైగా భారం
ఏపీలోని అంగన్ వాడీ టీచర్లకు సీఎం చంద్రబాబునాయుడు వరాలజల్లు కురిపించారు. అంగన్ వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను భారీగా పెంచుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలోని తన నివాసంలోని ప్రజాదర్బార్ హాలులో సాధికార మిత్రలతో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, రూ.7,500 ఉన్న అంగన్ వాడీ టీచర్ల వేతనాన్ని రూ.10,500కు, రూ.4,500 గా ఉన్న ఆయాల వేతనాలను రూ.6,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు. అన్ని వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే అంగన్ వాడీల వేతనాలను రెండోసారి పెంచామని చెప్పారు. అంగన్ వాడీలకు వేతనాల పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.305 కోట్లకు పైగా భారం పడుతుందని అన్నారు. అంగన్ వాడీలందరికీ త్వరలోనే స్మార్ట్ ఫోన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో శిశుమరణాల సంఖ్య తగ్గిందని, చిన్నపిల్లలు చనిపోకుండా ఉండాలనే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. గర్భిణులు సురక్షితంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగిందని చంద్రబాబు చెప్పారు. 
Andhra Pradesh
anganwadi
Chandrababu

More Telugu News