శ్రీను వైట్ల మూవీలో రవితేజ అలా ట్విస్ట్ ఇస్తాడట!
- శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ
- కథానాయికగా ఇలియానా
- విదేశాల్లో అధికభాగం చిత్రీకరణ
అయితే తాజాగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రల్లో కనిపించడట. ఉన్నది ఒకటే పాత్ర .. మిగతా రెండు పాత్రల్లో కనిపించేది కూడా అదే పాత్ర అని అంటున్నారు. అంటే రవితేజ డిఫరెంట్ గెటప్స్ లో మాత్రమే కనిపిస్తాడు గానీ .. పాత్రలు వేరు కాదన్న మాట .. అదే ఈ సినిమాలోని ట్విస్ట్. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఇలియానా కనిపించనుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'కిక్' .. 'ఖతర్నాక్' .. 'దేవుడు చేసిన మనుషులు' చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.