ఎన్టీఆర్ ఎక్కడ?... నాని ఎక్కడ? నాకు నచ్చలేదు: బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన సంజన

  • కామన్ మ్యాన్ కోటాలో హౌస్ లోకి వెళ్లిన సంజన
  • తొలివారంలోనే ఎలిమినేషన్ 
  • నానీ పెర్ ఫార్మెన్స్ నచ్చలేదన్న సంజన
తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్ లో కామన్ మ్యాన్ కోటాలో హౌస్ లోకి ప్రవేశించి, తొలివారంలోనే ఎలిమినేట్ అయిన సంజన, కార్యక్రమ వ్యాఖ్యాత, హీరో నానిపై సెన్సేషనల్ కామెంట్లు చేసింది. హోస్ట్ గా నాని తనకు నచ్చలేదని చెప్పింది. ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించారని, తొలి సీజన్ అంత పెద్ద హిట్ కావడానికి ఎన్టీఆర్ కారణమని వ్యాఖ్యానించిన సంజన, ఆ స్థాయిలో నాని పెర్ ఫార్మెన్స్ లేదని అభిప్రాయపడింది.

"ఎన్టీఆర్ ఎక్కడ? నాని ఎక్కడ? అందుకే నేను బయటకు వచ్చినా పెద్దగా బాధపడలేదు. బిగ్ బాస్ లో మరో అవకాశం వచ్చినా వెళ్లను" అని చెప్పింది. తాను ఎన్టీఆర్ అభిమానినని, నాని సినిమాలను వ్యక్తిగతంగా ఇష్టపడతానని వ్యాఖ్యానించింది. కాగా, అనూహ్య మలుపుల మధ్య నూతన్ నాయుడు, కౌషల్ తో పోటీపడి సంజన ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బయటకు వచ్చిన తరవాత బిగ్ బాంబ్ ను గోగినేనిపై సంజన ప్రయోగించగా, ఇప్పుడాయన హౌస్ లోని అందరికీ మంచినీళ్లు అందిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఓ వెబ్ చానల్ కు సంజన ఇచ్చిన ఇంటర్వ్యూను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Tollywood
Bigboss
Sanjana
Comman Man
Nani
NTR

More Telugu News