మా గోడు వినేదెవరు?: హైదరాబాద్ లో సమావేశమైన 200 మంది స్వలింగ సంపర్కులు!
- సమాజంలో గౌరవం దక్కడం లేదు
- హక్కులు కాపాడాలని స్వలింగ సంపర్కుల డిమాండ్
- లామ్ కాన్ లో సమావేశం
ప్రతి సంవత్సరం జూన్ ను స్వలింగ సంపర్కుల హక్కుల పోరాట మాసాన్ని నిర్వహిస్తుండగా, దానిలో భాగంగా ఈ సమావేశం జరిగింది. కాలేజీల్లో తమను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని ఓ యువకుడు, తాను 'గే'నని తెలుసుకుని వారం రోజుల పాటు గదిలో బంధించి అన్నం కూడా పెట్టలేదని మరో యువకుడు తమ అనుభవాలు పంచుకున్నారు. తన శరీరంలో వస్తున్న మార్పులు చూసిన తన తండ్రి దారుణంగా కొట్టి తరిమేశాడని మరో యువకుడు వాపోయాడు. ఏ పాపమూ చేయకుండానే తాము రోడ్డున పడాల్సి వచ్చిందని, తమకు గుర్తింపు కావాలని ఎల్జీబీటీ నేతలు డిమాండ్ చేశారు.