ఎన్డీయే నుంచి నితీశ్ బయటకొస్తే.. మాతో కలుపుకుంటాం: కాంగ్రెస్
- బీహార్లో బీజేపీ-జేడీయూ మధ్య విభేదాలు
- 2019 లోక్ సభ సీట్ల సర్దుబాటుపై పరస్పర విరుద్ధ ప్రకటనలు
- బీజేపీకి నితీశ్ దూరం జరుగుతున్నారంటూ వార్తలు
2015లో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ కలిసి మహాకూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశాయి. వచ్చే ఎన్నికల్లో లోక్సభ సీట్ల పంపకంపై బీజేపీ-జేడీయూ మధ్య విభేదాలు తలెత్తి, రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.