తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

  • రాగల మూడు రోజుల్లో వర్షాలు
  • రేపు కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
  • ఇతర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. ఉత్తర బీహార్‌ నుంచి తెలంగాణ వరకు జార్ఖండ్‌, ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గ‌ఢ్‌ మీదుగా సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, రాగల మూడు రోజులలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది. ఇతర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కోస్తాంధ్రలో, ఎల్లుండి రాయలసీమలో వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది.
rain
Andhra Pradesh
Telangana

More Telugu News