రెడ్ మీ నుంచి ‘ఊహించని’ నాలుగు ఇతర ఉత్పత్తులు విడుదల

  • టీ షర్ట్, రోలర్ బాల్ పెన్, పిల్లో, చార్జింగ్ కేబుల్
  • వీటి ధరలు రూ.129 నుంచి రూ.999 మధ్య
  • రికార్డింగ్ ఆప్షన్ తో కార్లకు రేర్ వ్యూ మిర్రర్ విడుదల
చైనాకు చెందిన షియోమీ సంస్థ స్మార్ట్ ఫోన్లు కాకుండా ఓ నాలుగు ఇతర ఉత్పత్తులను ఎంఐ బ్రాండ్ కింద భారత్ లో విడుదల చేసింది. వీటి ధరలు రూ.129 నుంచి రూ.999 మధ్య ఉన్నాయి. ఎంఐ రోలర్ బాల్ పెన్, యూ ఆకారంలో ఉన్న  ఎంఐ ట్రావెల్ పిల్లో (ప్రయాణించే సమయంలో మెడకు, సీటుకు మధ్య గ్యాప్ సర్దుబాటు కోసం పెట్టుకునేది), ‘ఐలవ్ ఎంఐ’ అనే ట్యాగ్ తో ఉన్న టీషర్ట్, ఎంఐ2 బ్యాండ్ చార్జింగ్ కేబుల్ ఉన్నాయి. ఎంఐ డాట్ కామ్ లో వీటిని కొనుగోలు చేసుకోవచ్చు.

ఎంఐ రోలర్ బాల్ పెన్ ధర 179. ట్రావెల్ పిల్లో ధర రూ.999. టీ షర్ట్ ధర రూ.399. చార్జింగ్ కేబుల్ ధర రూ.129. షియోమీ కేవలం స్మార్ట్ ఫోన్లకే పరిమితం కాకుండా లైఫ్ స్టయిల్ గ్యాడ్జెట్ల విడుదలపైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే పలు ఉత్పత్తులను తీసుకొస్తోంది. చైనాలో తాజాగా కార్లకు రేర్ వ్యూ మిర్రర్ ను విడుదల చేసింది. ఇందులో రికార్డింగ్ సదుపాయం, వాయిస్ కంట్రోల్ ఆప్షన్లు ఉన్నాయి. కారును పార్క్ చేసే విషయంలో ఇది తోడ్పడుతుంది.  చైనాలో దీని ధర మన కరెన్సీలో చూస్తే రూ.4,200.
Go Back to Shorts
mi gadgets
tshirt
pillow
roller ball pen
charging cable

More Telugu News