రాక్షస సైన్యానికి శుక్రాచార్యుడు విజయసాయిరెడ్డి: డొక్కా
- జగన్ కేసులు ఎత్తి వేసేందుకు బీజేపీ హామీ ఇచ్చింది
- అందుకే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేశారు
- ఏపీ భవన్ సాక్షిగా కుట్రలు జరుగుతున్నాయి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాక్షస సైన్యానికి శుక్రాచార్యుడిలా అవతరించారని డొక్కా అన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి కేంద్రం చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదని మండిపడ్డారు. కడపకు ఉక్కు పరిశ్రమను ఇవ్వలేమని కేంద్రం చెప్పినా... జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. బీజేపీ కుట్రలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తామని తెలిపారు.