ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను స్వయంగా కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు!
- హైదరాబాద్ పరిధిలోని కుషాయిగూడలో ఘటన
- ఏప్రిల్ 24న ఆర్యసమాజ్ లో ఆనంద్, రుచితల వివాహం
- ఆనంద్ ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసిన రుచిత తల్లిదండ్రులు
అయితే, వీరి పెళ్లికి రుచిత తల్లిదండ్రులు శ్రీధర్, భవానీ అంగీకరించలేదు. విడిపోయి ఉండలేమని భావించిన ఆనంద్, రుచితను ఏప్రిల్ 24న ఆర్యసమాజ్ లో వివాహం చేసుకుని, ఆపై తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం సమయంలో శ్రీధర్, భవాని, మరో ఇద్దరితో కలసి కారులో కుషాయిగూడకు వచ్చారు. ఆనంద్ తల్లి యాదమ్మను కొట్టి రుచితను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ఆ ప్రాంతం నుంచి వేగంగా వెళుతూ వారి కారు చేసిన ఫీట్లకు స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.