మూడో రోజు టెట్ కు 47,276 మంది అభ్య‌ర్థుల‌ హాజరు: ఏపీ టెట్ క‌న్వీన‌ర్

12-06-2018 Tue 19:57 | Andhra
  • పేప‌ర్ 1 ఎస్టీటీ తెలుగుకి సంబంధించి ప‌రీక్ష
  • మొత్తం 99 సెంట‌ర్ల‌లో ప‌రీక్ష
  • మార్కుల వివ‌రాలు రేపు అభ్య‌ర్థుల మొబైళ్ల‌కు..
  • టెట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ అభ్య‌ర్థులకు సూచనలు
మూడో రోజు అన్ని ప‌రీక్షా కేంద్రాల్లో ఏపీ ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టెట్) ప్ర‌శాంతంగా జ‌రిగింది. అభ్య‌ర్థుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా మూడో రోజు టెట్  ముగిసిందని, మొత్తం 47,276 మంది ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యార‌ని టెట్ క‌న్వీన‌ర్ ఏ.సుబ్బారెడ్డి ఈరోజు విడుద‌ల చేసిన పత్రికా ప్ర‌క‌ట‌నలో పేర్కొన్నారు. పేప‌ర్ 1 ఎస్టీటీ తెలుగుకి సంబంధించి ప‌రీక్ష నిర్వ‌హించామ‌ని, ఈ ప‌రీక్ష‌కు 49,380 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారని అన్నారు.

ఈ రోజు మొత్తం 95.74 శాతం మంది టెట్ కు హాజ‌ర‌య్యార‌ని చెప్పారు. మొత్తం 99 సెంట‌ర్ల‌లో ప‌రీక్ష నిర్వ‌హించామ‌న్నారు. టెట్ ప‌రీక్ష ముగిసిన వెంట‌నే బ‌ట‌న్ నొక్క‌గానే అభ్య‌ర్థుల‌కు త‌మ‌త‌మ మార్కులు స్క్రీన్ పై క‌నిపించాయి. ఈ మార్కుల వివ‌రాల‌ను రేపు అభ్య‌ర్థుల మొబైళ్ల‌కు పంపిస్తామ‌ని టెట్ క‌న్వీన‌ర్ ఏ సుబ్బారెడ్డి తెలిపారు.

టెట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ అభ్య‌ర్థులకు సూచనలు..

టెట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా క్రీడ‌ల్లో తాము సాధించిన ప్ర‌తిభా ప‌త్రాల‌ను టెట్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంద‌ని, వీటికి సంబంధించి అనుబంధ ఫార్మాట్ లు వెబ్ సైట్ లో ఉంచామ‌ని టెట్ క‌న్వీన‌ర్ ఏ సుబ్బారెడ్డి తెలిపారు. అనుబంధ ప‌త్రం 1, 2, 3 లుగా ఉంచామ‌ని ఒక్కో ప‌త్రానికి 30 ఇన్సెంటివ్ మార్కులు, రెండో ఫార్మాట్ కు 25, మూడో ఫార్మాట్ కు 20 మార్కులు ఉంటాయ‌న్నారు. వీటిని సంబంధిత ఫెడ‌రేష‌న్లు, యూనివ‌ర్సిటీలు, స్కూల్ గేమ్స్ ఫెడ‌రేష‌న్ల వ‌ద్ద ధ్రువీక‌ర‌ణ చేయించుకొని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంద‌ని ఆయ‌న వివరించారు.
Andhra Pradeshtet

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more