పక్కాగా ప్లాన్ చేసుకుంటోన్న విశాల్ .. ఎన్టీఆర్ కి పోటీగా దసరా బరిలోకి!
Add ap7am to your home Screen

పక్కాగా ప్లాన్ చేసుకుంటోన్న విశాల్ .. ఎన్టీఆర్ కి పోటీగా దసరా బరిలోకి!

  • ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత వీర రాఘవ'
  • విశాల్ కథానాయకుడిగా 'పందెం కోడి' సీక్వెల్
  • దసరా పండుగకి ప్రేక్షకుల ముందుకు  
త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం రూపొందుతోంది. ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకు చిత్రీకరణను జరుపుకుంది. సిక్స్ ప్యాక్ తో కూడిన ఎన్టీఆర్ లుక్ .. ఈ సినిమా నేపథ్యం గురించి వచ్చిన వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాను దసరాకి భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.ఇక తమిళంలో విశాల్ తాజా చిత్రంగా 'పందెం కోడి' సీక్వెల్ రూపొందుతోంది. గతంలో వచ్చిన 'పందెం కోడి' తెలుగులో ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమాను ఇప్పటికీ మరిచిపోని ప్రేక్షకులు, సీక్వెల్ పై ఎంతో ఆసక్తిని కనబరచడం ఖాయం. అలాంటి ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను దసరాకి విడుదల చేయడానికి విశాల్ రెడీ అవుతున్నాడు. తాజాగా 'అభిమన్యుడు' ఇచ్చిన హిట్ కారణంగా, ఎన్టీఆర్ మూవీతో పాటు దసరా బరిలోకి దిగేందుకు విశాల్ సాహసం చేస్తున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.      
ntr
vishal

More Telugu News