మేఘాలయలో రెచ్చిపోతున్న ‘లాడెన్’.. 37 మందిని తొక్కి చంపేసిన ఏనుగు!

10-06-2018 Sun 07:16 | National
  • జనాలకు కంటి మీద కునుకును దూరం చేస్తున్న ఏనుగు
  • దానిని చూస్తే అటవీ అధికారులకూ వణుకే
  • కాల్చి చంపేలా ఉత్తర్వుల కోసం ఉన్నతాధికారులకు వేడుకోలు
ప్రజల ప్రాణాలను ఈజీగా తీసేస్తున్న ఈ ఏనుగుకు ఉగ్రవాది లాడెన్ పేరు పెట్టింది అందుకే. ఏకంగా 37 మంది ప్రాణాలను తీసేసింది. మేఘాలయలోని గరోహిల్స్‌లో ఇప్పుడీ లాడెన్ పేరు వింటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 2016 నుంచి ఇది హడలెత్తిస్తోంది. అటవీ అధికారులు కూడా భయపడిపోతున్నారు. గ్రామాలు, జనావాసాలపై పడి దాడులు చేసి జనాలను చంపేస్తోంది. అతి భారీ కాయంతో ఉండే దీనిని చూస్తేనే చెమటలు పడుతుంటాయి.

‘లాడెన్’ ఆగడాలు మరీ పెచ్చుమీరడంతో కాల్చి చంపేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను కోరినట్టు అధికారులు తెలిపారు. తాజాగా ఈనెల 2న తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అసోంలోని పట్‌పారా పహర్టోలీ గ్రామంలో ఓ గిరిజనుడి ఇంటిపై  ఏనుగు దాడి చేసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇంటి యజమాని హజోంగ్‌ను తొక్కి చంపేసింది.

సాయంత్రం కాగానే గ్రామాలపై పడడం, అడ్డం వచ్చిన వారిని చంపడాన్ని పనిగా పెట్టుకున్న ఈ లాడెన్‌ను కాల్చి చంపడం తప్ప మరో మార్గం లేదని అధికారులు చెబుతున్నారు. అందుకే ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.
ElephantAssamLadenterrorist

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more