చైనాకు బయల్దేరిన మోదీ.. ఆరు వారాల్లో రెండో సారి!
- షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో పాల్గొననున్న మోదీ
- రెండు రోజుల పాటు జరగనున్న సమావేశాలు
- జిన్ పింగ్ తో ప్రత్యేకంగా భేటీ కానున్న మోదీ
గత ఏడాది కజకిస్థాన్ లో జరిగిన ఆస్తానా సమావేశాల్లో భారత్, పాకిస్థాన్ లకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. శాశ్వత సభ్యత్వం లభించిన తర్వాత ఈ సమావేశాల్లో పాల్గొంటున్న తొలి భారత ప్రధాని మోదీనే. ఈ సమావేశాల్లో ఉగ్రవాదంపై పోరాటం, వాణిజ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, పరస్పర సహకారం, తదితర అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు చైనా అధినేత జిన్ పింగ్ తో మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ మధ్యాహ్నం 1.20 గంటలకు మోదీ క్వింగ్డావో చేరుకుంటారు.