సుదీప్ జోడీగా మడోన్నా సెబాస్టియన్ .. యూరప్ లో షూటింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుదీప్ జోడీగా మడోన్నా సెబాస్టియన్ .. యూరప్ లో షూటింగ్

  • సుదీప్ హీరోగా 'కోటిగొబ్బ 3'
  • కథానాయికగా మడోన్నా 
  • ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్
కన్నడలో స్టార్ హీరోగా సుదీప్ ఒక వెలుగు వెలుగుతున్నాడు. అక్కడి మాస్ ఆడియన్స్ మనసు దోచేసిన ఆయన, 'కోటిగొబ్బ 3' సినిమా కోసం రెడీ అవుతున్నాడు. గతంలో వచ్చిన 'కోటిగొబ్బ' .. 'కోటిగొబ్బ 2' సినిమాలు ఆయనకి ఘన విజయాలను తెచ్చిపెట్టాయి. అయితే ఆ సినిమాలకి సీక్వెల్ కాకపోయినా, ఆ టైటిల్ కి వచ్చిన క్రేజ్ కారణంగా 'కోటిగొబ్బ 3' సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు.ఈ సినిమాలో సుదీప్ జోడీగా మడోన్నా సెబాస్టియన్ నటించనుంది. మలయాళ 'ప్రేమమ్'తో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మాయి, ఆ తరువాత తమిళ సినిమాలతో బిజీ అయింది. కన్నడలో సుదీప్ జోడీగా ఛాన్స్ దక్కడం పట్ల ఆమె చాలా హ్యాపీగా ఫీలవుతోంది. యూరప్ లోని సెర్బియాలో ఈ నెల 16 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. తొలిసారిగా అక్కడ షూటింగ్ జరుపుకుంటోన్న తొలి కన్నడ చిత్రం ఇదే కావడం విశేషం. 40 రోజుల పాటు అక్కడ ప్రధాన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.  
sudeep
madonna sebastian

More Telugu News