మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఘన స్వాగతం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఘన స్వాగతం

  • రేపు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం
  • ప్రసంగించనున్న ప్రణబ్‌
  • ఏం మాట్లాడతారన్న ఆసక్తి
మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరుగనున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కాంగ్రెస్‌ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నప్పటికీ ఆయన కొద్ది సేపటి క్రితం నాగ్‌పూర్ చేరుకున్నారు.

విమానాశ్రయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. కాగా, రేపు జరగనున్న ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమంలో ప్రణబ్‌ ఏం మాట్లాడతారన్న ఆసక్తి నెలకొంది. ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం ఈ విషయంపై స్పందిస్తూ ఆర్ఎస్‌ఎస్‌ భావజాలంలో లోపం ఎక్కడుందో చెప్పండంటూ వ్యాఖ్యానించారు. కాగా, తాను ఏం మాట్లాడతానో నాగ్‌పూర్‌లోనే చూడండని ప్రణబ్ ఇటీవల మీడియాకు చెప్పారు.
rss
Congress
Pranab Mukherjee

More Telugu News