దేవుడి సాయం అలా అందుతుంది: కోడి రామకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేవుడి సాయం అలా అందుతుంది: కోడి రామకృష్ణ

  • ఒకసారి శబరిమల వెళ్లాము 
  • దర్శనం చేసుకుని వెనుదిరిగాము 
  • సమయానికి రైల్వే స్టేషన్ కి చేరుకోవాలి
దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న కోడి రామకృష్ణ, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నేను దైవశక్తిని నమ్ముతాను .. అందువల్లనే నేను తెరకెక్కించిన ఆ తరహా సినిమాలకి మంచి ఆదరణ లభించింది. ఒకసారి నేను నా సన్నిహితులతో కలిసి శబరిమల వెళ్లాను. నాతో కలిపి మొత్తం 36 మంది .. అందరం కలిసి స్వామి దర్శనం చేసుకుని వెనుదిరిగాము .. మేము వచ్చిన బస్సులోనే అంతా రైల్వే స్టేషన్ కి చేరుకోవాలి.

అయితే మా బస్సువాడు మమ్మల్ని అక్కడ దింపేసి, ఆ తర్వాత అక్కడ నుంచి మాయమయ్యాడు. ఫలానా బస్సు మీరు చూశారా? అంటూ వచ్చీపోయే వాళ్లని అడిగాం. అది టెలిఫోన్ ఎక్చేంజ్ దగ్గర ఉందని కొందరు చెప్పారు. అదెక్కడో మాకు తెలియదు. ఈలోపల ట్రైన్ టైం అవుతోంది. అందరూ కంగారుపడిపోతున్నారు.

అంతలో ఓ కుర్రాడు జీపులో మా దగ్గరికి వచ్చాడు .. ఎక్కడికి వెళ్లాలని అడిగాడు. టెలిఫోన్ ఎక్చేంజ్ దగ్గరున్న మా బస్సు దగ్గరికి వెళ్లాలని చెప్పాం. ఆ కుర్రాడు జీపు ఎక్కమనడంతో అంతమందిమీ ఒకే జీపు ఎక్కేశాం. ఆ కుర్రాడు మమ్మల్ని మా బస్సు దగ్గరికి చేర్చాడు. ఎంతకావాలన్నా ఇస్తామని అంటే .. డీజిల్ డబ్బులు ఇవ్వండి చాలు అన్నాడు. అయ్యప్ప స్వామినే ఆ రూపంలో వచ్చాడనుకున్నాం .. ఇట్లా దేవుడి సాయం సమయానికి అందుతుంది" అని చెప్పుకొచ్చారు.   
kodi ramakrishna

More Telugu News