Football: 30 మంది వేశ్యలతో ఫుట్ బాల్ జట్టుకు పార్టీ ఇచ్చి వీడ్కోలు చెప్పిన మెక్సికో!

  • యూరప్ కు వెళ్లే ముందు పార్టీ
  • పాల్గొన్న 9 మంది ఆటగాళ్లు
  • వారిపై చర్యలు ఉండబోవని చెప్పిన అధికారులు
మరో వారంలో ఫుట్ బాల్ వరల్డ్ కప్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, యూరప్ కు బయలుదేరి వెళ్లే ముందు తమ దేశపు ఆటగాళ్లకు మెక్సికో వీడ్కోలు పలుకుతూ 30 మంది వేశ్యలను అక్కడికి పిలిపించారని మీడియాలో వార్తలు రావడంతో కలకలం రేగుతోంది.

ఓ ప్రైవేటు రిసార్ట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొమ్మిది మంది ఆటగాళ్ల కోసం వేశ్యలను పిలిపించారని, స్కాట్లాండ్ పై 1-0 తేడాతో జట్టు విజయం సాధించిన తరువాత, ఈ పార్టీ జరిగిందని చెబుతూ ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా అక్కడి మ్యాగజైన్ ఒకటి ప్రచురించింది. ఈ వార్తలపై స్పందించిన అధికారులు, ఖాళీగా ఉన్న సమయంలో వారు పార్టీ చేసుకున్నారని, వారిపై ఎలాంటి చర్యలూ ఉండవని వ్యాఖ్యానించడం గమనార్హం. వాళ్లు శిక్షణా శిబిరాలకు క్రమం తప్పకుండా హాజరయ్యారని, సెలవు రోజున వారి వ్యక్తిగత స్వేచ్ఛ వారిదేనని చెప్పారు.
Football
Mexico
Prostitutes
Team
Party

More Telugu News