జేబులోనే పేలిపోయిన సెల్ ఫోన్... వీడియో ఇదిగో!
- ముంబైలోని రెస్టారెంట్ లో ఘటన
- పరుగులు తీసిన కస్టమర్లు
- సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఘటన
ఈ నెల 4వ తేదీన ఘటన జరిగినట్టు తెలుస్తుండగా, షర్ట్ జేబులో పెట్టుకున్న ఫోన్ పేలి, రెస్టారెంట్ అంతా పొగలు వ్యాపించాయి. అతనికి స్వల్పగాయాలు కాగా, ఆసుపత్రిలో చేర్పించారని తెలుస్తోంది. గడచిన మార్చిలో ఒడిశాలోని ఓ టీనేజర్ తన బంధువుతో ఫోన్ మాట్లాడుతూ చార్జింగ్ పెట్టగా, అది పేలిపోయిన సంగతి తెలిసిందే. ముంబై రెస్టారెంట్ లో జరిగిన ఘటన వీడియోను మీరూ చూడవచ్చు.