వైసీపీలో చేరబోయిన మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు... అడ్డుకునేందుకు మరో వర్గం దాడి!
- గతంలో ఆదితో పాటు కలసి టీడీపీలో చేరిన స్థానిక నేతలు
- తిరిగి వైసీపీలోకి వెళ్లే ప్రయత్నం
- ఘర్షణల నేపథ్యంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు
ఆపై ఇప్పుడు వారు తిరిగి వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఆదినారాయణరెడ్డి వర్గం వారిపై దాడికి దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, హుటాహుటిన అక్కడికి చేరుకుని, రెండు వర్గాలనూ చెదరగొట్టారు. ఈ ఘటన తరువాత పెద్దదండ్లూరు, సుగమంచిపల్లె గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొని వుండగా, రెండు గ్రామాల్లోనూ పోలీసులు ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు.