మందు కొట్టి పట్టుబడి పోలీసులను, మీడియాను ఆడిపోసుకున్న లేడీ టీచర్... వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మందు కొట్టి పట్టుబడి పోలీసులను, మీడియాను ఆడిపోసుకున్న లేడీ టీచర్... వీడియో!

  • శనివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్
  • హైదరాబాద్, బంజారాహిల్స్ లో పట్టుబడిన 72 మంది
  • హల్ చల్ చేసిన లేడీ టీచర్
గత రాత్రి వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా, 72 మంది పట్టుబడ్డారు. శనివారం అర్ధరాత్రి నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో మందు కొట్టి వాహనాలు నడిపిన పలువురు అడ్డంగా బుక్కయ్యారు. ఓ మహిళా టీచర్ మద్యం తాగిందన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు చేయబోగా సహకరించకుండా హల్ చల్ చేసింది. తనను చిత్రీకరిస్తున్న మీడియాపైనా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చివరకు మహిళా పోలీసుల సహకారంతో ఆమెకు బ్రీత్ టెస్ట్ చేసి, ఆమె వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఈ తనిఖీల్లో మొత్తం 26 కార్లు, 46 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని, మద్యం తాగిన వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి, కోర్టుకు హాజరు పరుస్తామని వెల్లడించారు. పట్టుబడిన వారిలో 12 మంది మహిళలు ఉన్నారని తెలుస్తోంది. కఠిన చట్టాలు తీసుకువచ్చి, జైలు శిక్షలు విధిస్తున్నా, యువత మారడం లేదని పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.
Hyderabad
Police
Drunk Driving
Lady Teacher

More Telugu News