నకిలీ పాస్‌పోర్ట్‌తో హైదరాబాద్‌లో పట్టుబడ్డ పాకిస్థానీ

  • భారత్‌లోకి 12 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు
  • హైదరాబాద్‌లో తలదాచుకుంటోన్న ఓ పాకిస్థానీ
  • పూర్తి వివరాలు త్వరలో చెబుతామన్న పోలీసులు
పాకిస్థాన్ సరిహద్దు దాటి 12 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో దేశ వ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో హైదరాబాద్‌లో ఓ పాకిస్థానీ పట్టుబడ్డాడు. అతడు నకిలీ ధ్రువపత్రాలతో పాస్‌పోర్టు పొంది, హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నట్లు తెలిసింది. అతడి పేరు మహమ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రాన్‌ అని పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నామన్న పోలీసులు, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. దేశంలో ఉగ్రవాదులు ప్రవేశించారన్న హెచ్చరికలతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు.                     
Go Back to Shorts
pass port
Hyderabad
Police

More Telugu News