8,235 ఆర్జిత సేవా టిక్కెట్లను లాటరీకి ఉంచిన టీటీడీ!
- సెప్టెంబర్ నెల టిక్కెట్లు అందుబాటులోకి
- మొత్తం 49,060 టిక్కెట్ల విడుదల
- బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తగ్గిన కోటా
ఇంకా వీటితో పాటు విశేష పూజకు 1,500, కల్యాణోత్సవంకు 9,975, ఊంజల్ సేవకు 3,150, ఆర్జిత బ్రహ్మోత్సవంకు 5,500, వసంతోత్సవంకు 9,900, సహస్ర దీపాలంకరణకు 10,800 టిక్కెట్లను ఎప్పటిలా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. లక్కీ డిప్ లో పాల్గొనే భక్తులు, నేటి నుంచి నాలుగు రోజుల్లోగా నమోదు చేసుకోవాల్సి వుంటుంది. కాగా, సెప్టెంబరులో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలున్న సందర్భంగా ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా గణనీయంగా తగ్గింది.