బీహార్ లో నితీష్ కుమార్ కు షాక్ ఇచ్చిన లాలూ ప్రసాద్ పార్టీ
- జోకిహట్ ఉపఎన్నికలో ఆర్జేడీ గెలుపు
- భారీ తేడాతో ఓడిపోయిన జేడీయూ
- నితీష్ పై పైచేయి సాధించిన లాలూ
జోకిహట్ స్థానం నుంచి 2015లో జేడీయూ తరపున సర్ఫరాజ్ ఆలం గెలుపొందారు. ఈ ఏడాది మార్చిలో ఆయన ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన తండ్రి మహ్మద్ తస్లిముద్దీన్ మరణంతో ఖాళీ అయిన ఆరారియా లోక్ సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఎంపీగా సర్ఫరాజ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో జోకిహట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో సర్ఫరాజ్ సోదరుడు షానవాజ్ ఆలం ఆర్జేడీ తరపున బరిలోకి దిగి, ఘన విజయం సాధించాడు. ఈ ఓటమితో జేడీయూ శిబరం చిన్నబోయింది.